ఫిల్మ్ సర్కిల్స్ తాజా సమాచారం ప్రకారం.. 'ఉప్పెన' నిర్మాతలు ఇంకా వెయిటింగ్ మోడ్లో ఉన్నారట. ఈ చిత్రాన్ని ఖచ్చితంగా థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని వారు యోచిస్తున్నారట. రాబోయే ఉగాది.. లేదా థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ పర్మిషన్.. ఈ రెండిట్లో ఏది ముందుగా వస్తే అప్పుడు థియేటర్లలోనే విడుదల చేయనున్నట్ట సమాచారం.