ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలోని సినిమా పూర్తి చేయాలనీ అనుకున్నాడు.. ఆ సినిమా తర్వాత హరీష్ శంకర్ సినిమా ను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా విడుదల చేయాలనీ చూశాడు కానీ కరోనా కారణంగా వకీల్ సాబ్ సినిమా ఇంకా పూర్తి కాకపోవడం తో మిగితా సినిమాలన్నీ ఆటోమేటిక్ గా ఆగిపోయాయి. దానికి తోడు అనుకోకుండా అయ్యప్పన్ కోషియం రీమేక్ కూడా వెంటనే చేయాల్సిన పరిస్థితి వచ్చింది.