మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా లో రామ్ చరణ్ ఓ కీలక పాత్ర లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. దాదాపు నలభై నిముషాలు ఈ సినిమా లో తన పాత్ర ఉండబోతుంది.. ఒకవిధంగా ఈ సినిమా మెగా మల్టీ స్టారర్ సినిమా అని చెప్పాలి..కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమా ని సమ్మర్ లో విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు.