తన సెకండ్ ఇన్నింగ్స్ లో అన్ని రకాల పాత్రలు చేస్తున్న సునీల్ కోసం త్రివిక్రమ్ మరోసారి రంగంలోకి దిగుతున్నాడు.. సునీల్ ని కమెడియన్ నుంచి హీరో గా చేసిన త్రివిక్రమ్ ఇప్పుడు గాడి తప్పిన సునీల్ కెరీర్ ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.. టాలీవుడ్ లో కమెడియన్ గా టాప్ రేంజ్ లో ఉన్న సమయంలో హీరో గా చేసి చాలా డౌన్ అయిపోయిన సంగతి అందరికి తెలిసిందే.. కమెడియన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు హీరో గా మారి కొన్ని సినిమాలు హిట్ కొట్టినా ఆ తర్వాత అన్ని ఫ్లాప్ సినిమాలు చేసి దారుణమైన ఇమేజ్ ని మూటగట్టుకున్నాడు..