సూపర్ స్టార్ మహేష్ బాబు చాల రోజుల గ్యాప్ ఇచ్చి మరీ సర్కార్ వారి పాట సినిమా ని ఒప్పుకున్నాడు. షూటింగ్ కి వెళ్లని ఈ సినిమా ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకుని రెడీ గా ఉంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి పరశురామ్ దర్శకుడు.. సరిలేరు నీకెవ్వరూ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా పై మహేష్ అభిమానులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. గీత గోవిందం లాంటి క్లాసిక్ హిట్ కొట్టిన పరశురామ్ ఈ సినిమా కి దర్శకుడు కావడంతో మహేష్ తో సినిమా ను ఎలా చేస్తాడో అని అందరు అర్థుతగా ఎదురుచూస్తున్నారు.