సాహూ రిలీజ్ అయ్యి చాల రోజులే అవుతున్నా ప్రభాస్ నుంచి ఎటువంటి సినిమా రిలీజ్ కి నోచుకోలేదు.. అందరు సినిమా లు నెలల్లోనే చేసి రిలీజ్ చేస్తుంటే ప్రభాస్ మాత్రం సంవత్సరాల తరబడి సినిమాలు చేయడం ఎవరికీ నచ్చడంలేదు. ప్రభాస్ చేతిలో సినిమాలు అయితే బాగానే ఉన్నాయి కానీ రిలీజ్ ఎప్పుడవుతాయో అన్న పరిస్థితి మాత్రం ఎవరికీ తెలీట్లేదు. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా నాలుగు సినిమాలను ఒప్పుకున్న సంగతి తెలిసిందే.. రాధే శ్యామ్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలను ఒప్పుకున్న ప్రభాస్ ఇటీవలే ప్రశాంత్ నీల్ సినిమా ను కూడా అనౌన్స్ చేశాడు.