మెగా స్టార్ చిరంజీవి ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అయన గత సినిమాలకంటే ఏమాత్రం తీసిపోకుండా ఉండబోతుందట. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ని రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తుండగా మణిశర్మ చాల రోజుల తర్వాత చిరంజీవి కి సంగీతం అందిస్తుండడం విశేషం.. దేవాలయాల నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండగా ఇప్పటికే వచ్చినా మోషన్ పోస్టర్ మరిన్ని అంచనాలు పెంచేలా చేసింది.