రాజకీయాల్లో చంద్రబాబు రాజకీయం సెపరేట్ గా ఉంటుంది. అందుకే దొడ్డిదారిన ఇంత త్వరగా ఇంతటి స్థాయికి చేరుకోగలిగాడు. ఓ పార్టీ తరపున ఇన్ని రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశాడంటే అయనకి రాజకీయాల్లో ఎంతటి చాణక్యత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.. అయన ప్రజలకోసం కాకుండా పదవులకోసమే ఎక్కువగా ఆరాటపడుతుంటారు. ప్రజలకు సేవ చేయడం మరిచిపోయి తన ప్రయోజనాలను ఎలా మెరుగుపరుచుకోవాలని తీవ్రంగా శ్రమిస్తుంటాడు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను చిన్న చూపు చూస్తూ అధికారం కోల్పోయిన మరుక్షణం నుంచి ప్రజలే దేవుళ్లుగా ఆయనకు కనిపించడం జరుగుతూ ఉంటుంది.