తెలుగులో మరో భారీ మల్టీస్టారర్ ప్రారంభమైంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ నేడు ప్రారంభమైంది. హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సెట్ పైనే ఈ చిత్రం నెల రోజుల పాటు షూటింగ్ జరుపుకోనుంది. టైటిల్ ఇంకా ప్రకటించని ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకుడు. ప్రముఖ దర్శకుడు, హీరో పవన్ కల్యాణ్ సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు అందిస్తున్నారు.