సుమంత్ నటించిన ‘మళ్ళీరావా’ సినిమాలో హీరోయిన్ ఆకాంక్ష సింగ్ పాత్రకి డబ్బింగ్ చెప్పింది. అటు తరువాత మహేష్ బాబు- కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘భరత్ అనే నేను’ సినిమాలో హీరోయిన్ కియారా అద్వానీ పాత్రకు కూడా డబ్బింగ్ చెప్పింది.అంతేకాదు ‘హలో’ ‘రణరంగం’ చిత్రాల్లో కళ్యాణి ప్రియదర్శిని పాత్రకు అలాగే ‘చిత్రలహరి’ లో నివేదా పేతురాజ్ పాత్రకి కూడా డబ్బింగ్ చెప్పింది. నాని నటించిన ‘ఎం.సి.ఎ’ చిత్రంలోని ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ అనే పాటలో కూడా ఈమె కనిపిస్తుంది.