ఈ విషయం పై చర్చ జరిగినా వెంటనే ఆ న్యూస్ సర్క్యూలేషన్ ఆగిపోయింది..లేటెస్ట్ గా ఈ విషయం పై ఓ క్లారిటీ వస్తుంది. టాలీవుడ్‌కి చెందిన ఓ హీరోయిన్ని మనోజ్ ఇష్టపడుతున్నట్లు వార్తలు వచ్చినా అవి అవాస్తవమేనని సన్నిహితులు తెలిపారు. మోహన్‌బాబు కుటుంబానికి దగ్గరి బంధువైన అమ్మాయితోనే మనోజ్ వివాహం జరగనుందని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా మే నెలలలోనే వీరి పెళ్లి జరగనుందని సమాచారం. పర్సనల్ లైఫ్‌లో తలెత్తిన కొన్ని సమస్యలతో దాదాపు మూడేళ్లపాటు సినిమాలకు మనోజ్..సినిమాలకు దూరంగా గడిపాడు.