రవితేజ కెరీర్ లో రాజా ది గ్రేట్ సినిమా ప్రత్యేకమైంది.. ప్రతి నటుడి కెరీర్ లో అలాంటి సినిమా ఒక్కటి మాత్రమే వస్తుంది. అలాంటి సినిమానే రాజా ది గ్రేట్.. ఇలాంటి సినిమా ని ఏ హీరో వదులుకోవాలనుకోడు కానీ ఓ టాలీవుడ్ స్టార్ హీరో మాత్రం ఈ సినిమా ని వదులుకున్నాడు.. దాంతో ఆ ఆఫర్ రవితేజ ని వరించింది.. సినిమా కాస్త సూపర్ హిట్ అయ్యింది.. అంధుడిగా రవితేజ అద్భుతంగా నటించాడు.. ఓ అంధుడు కష్టాల్లో ఉన్న హీరోయిన్ ఎలా కాపాడాడు అన్నది సినిమా కాన్సెప్ట్.. దీన్ని ఎంతో బాగా తీర్చిదిద్దాడు దర్శకుడు అనిల్ రావిపూడి..