మొదట్లో మంచి హిట్ లు కొట్టిన రాజ్ తరుణ్ ఆ తర్వాత వరుస ఫ్లాప్ లతో ఫేడ్ అవుట్ అయిపోతున్నాడు.. రీసెంట్ గా వచ్చిన ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే సినిమా లు కూడా ఫ్లాప్ గా తేలిపోవడంతో రాజ్ తరుణ్ కెరీర్ ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఇప్పుడు చేయబోయే సినిమా హిట్ కొడితే తప్ప హీరోగా నిలివలేని పరిస్థితి ఉంది.. ఈ నేపథ్యంలో అయన కొత్త సినిమా పోస్టర్ అందరిని ఆసక్తి ని రేకెత్తిస్తుంది. ఉయ్యాల జంపాల సినిమా తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ కుమారి 21F తో కుర్రాడు కాదు టాప్ హీరో అవుతాడు అన్నారు.. మూడో సినిమా సినిమా చూపిస్త మావ కూడా సూపర్ హిట్ అవడంతో రాజ్ తరుణ్ టాప్ రేంజ్ కి వెళ్లడం ఖాయం అనుకున్నారు