దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం ఉంటుంది. తారలు మారుతున్న వారి ఆచారాలు అలాగే కొనసాగిస్తున్నారు. హిందూ సంప్రదాయంలో పెళ్ళికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అయితే గిరి శిఖర ప్రాంతాల్లో నివసించే కొండరెడ్ల గిరిజనుల జీవనం.. వారు పాటించే సంప్రదాయాలు ప్రత్యేకంగా ఉంటాయి. కొండరెడ్ల వివాహ సమయంలో కుటుంబ పెద్దలే పురోహితులుగా వ్యవహరిస్తారు.