పృథ్వి అదృష్టానికి సంబంధించిన ఒక న్యూస్ నేటిరోజు టాలీవుడ్ హాట్ న్యూస్ గా మారింది.  నాగార్జున సూర్య లాంటి టాప్ హీరోలు తమకు ‘బాహుబలి 2’ లో ఒక పాత్ర ఇస్తే బాగుటుంది అని రాజమౌళిని బహిరంగంగా అడుగుతున్న విషయం తెలిసిందే. అయితే అడగ కుండానే  పృథ్వికి ‘బాహుబలి 2’ లో ఒక పాత్ర లభించింది అని వార్తలు రావడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. 

‘బాహుబలి’  బిగినింగ్ లో హాస్యానికి సంబంధించి ఒక్క సన్నివేశం కూడా లేదు అని విమర్శలు వచ్చిన నేపధ్యంలో రాజమౌళి తన సెకండ్ పార్ట్‌లో హాస్యానికి సంబంధించి కొన్ని సీన్స్ క్రియేట్ చేసాడని టాక్. ఇప్పటికే చాలామంది నటీనటులను కొత్తగా ‘బాహుబలి 2’ లో రాజమౌళి  తీసుకున్నట్లు ప్రచారం సాగుతున్న నేపధ్యంలో కమెడియన్ పృథ్వీకి  కూడా ఛాన్స్ లభించినట్టు  ఫిలింనగర్ టాక్. 

రీసెంట్‌గా జక్కన్న  కమెడియన్ పృథ్వి ‘సౌఖ్యం’లో చేసిన కామెడీ చూసి ఆ నటన బాగా నచ్చడంతో ఈ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే  ‘బాహుబలి 2’ లో పృథ్వీ రోల్ ఏమిటి ? భళ్లాల దేవ కొలువులో వుంటాడా ? లేక బాహుబలి దగ్గర ఉంటాడా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అని అంటున్నారు. 

పృథ్వి కామెడీ తో ‘బాహుబలి’ మొదటి పార్ట్ లో లేని కామెడీ లోటును ‘బాహుబలి 2’ లో రాజమౌళి భర్తీ చేస్తాడని అంటున్నారు. ఈ  వార్తలే నిజం అయితే నిజంగానే పృథ్వి బ్రహ్మానందం స్థానాన్ని పృథ్వి భర్తీ చేసినట్లే అనుకోవాలి. ఏమైనా టాప్ హీరోలకు దక్కని అదృష్టం పృథ్వికి దక్కడం టాపిక్ అఫ్ డే టాలీవుడ్ గా మారింది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: