రావణబ్రహ్మ పాత్రకు సిల్వర్ స్కీన్ పై ఎప్పడూ తెలియని క్రేజ్ ఉంటూనే ఉంటుంది. ఎన్టీఆర్, ఎస్వీఆర్ లాంటి వాళ్ళు రావణ బ్రహ్మ పాత్రను పోషించి మెప్పించారు. ఇప్పడు డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రంలో శ్రీరాముడి పాత్రను పోషించడానికి సూర్య అంగీకారం చెప్పినట్టు వినికిడి. అదే జరిగితే తెలుగులో ఆయన నటించే రెండో చిత్రమవుతుంది. సూర్య రామ్ గోపాల్ వర్మ చిత్రం రక్త చరిత్ర 2 లో నటించిన విషయం తెలిసిందే. తాజాగా మండోదరి, సీత, హనుమంతుడి పాత్రలకు స్టార్ కాస్ట్ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: