ద అటాక్స్ ఆఫ్ 26బై11... ఇది రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రం. నవంబరు 26వ తేదీన ముంబైలోని తాజ్ హోటల్ పై ముష్కరమూకల దాడుల నేపథ్యాన్ని ఇతివ్రుత్తంగా తీసుకుని ఈ కథ రాసుకున్నాడు వర్మ. ఈ సినిమా ట్రైలర్ ని కూడా వినూత్నంగా విడుదల చేశాడు. సినిమా ప్రారంభాన్నే యథాతథంగా ట్రైలర్ గా పెట్టి అందరి ద్రుష్టినీ ఆకర్షించాడు. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో మార్చి ఒకటో తేదీన విడుదల చేయనున్నాడట. ఈ సందర్భంగా వర్మ మాట్లాడిన మాటలు అందరినీ ఆలోచింపజేశాయి. ‘నేను గతంలో చిత్రాలన్నీ ఒకెత్తు. ఈ ఒక్క సినిమా ఒకెత్తు. ముంబై దాడులు జరిగినప్పుడు వెంటనే నేను వెళ్లాను. అక్కడి పరిస్థితి చూసి నా గుండె ద్రవించింది. ఆ దారుణకాండకు చిత్రరూపమిచ్చి, భారతీయులను ఉత్తేజితుల్ని చేయాలనుకున్నాను. అందుకే, ఈ సినిమా తీస్తున్నాను. ఇది వ్యాపారం కోసమో వివాదాల కోసమో తీస్తున్న చిత్రం కాదు. ఆ మారణకాండలో చనిపోయినవాళ్లందరికీ ఈ చిత్రం అంకితం’ అని చెప్పి అందరి మనసులనూ గెలుచుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: