ఎక్కడికైనా తీసుకెళ్ళమని తమ పిల్లలు అల్లరి చేస్తుంటే బిజీ షెడ్యూళ్ళను పక్కనపెట్టి ఖుష్బూ వారిని సూర్య ఇంటికి తీసుకెళ్ళిందట. వారిని చూసి సూర్య, జ్యోతిక ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారట. జ్యోతిక దంపతులకు కూడా ఇద్దరు పిల్లలున్నారు. వారి పిల్లలు వీరి పిల్లలు కలిసి ఆడుకుంటుంటే పొద్దుపోవడమే తెలియలేదట. ఇందులో ఖుష్బూ చిన్నబుచ్చుకున్న విషయం కూడా ఒకటుంది. తన ఫ్యామిలీలో ఇప్పుడు అందరి కన్నా తానే ఎత్తు తక్కువట. తన పిల్లలు కూడా తనను మించి ఎదిగారట. అందుకే తన పిల్లలను వారి తండ్రి వెనక నడమని చెప్తోందట ఖుష్బూ.
మరింత సమాచారం తెలుసుకోండి: