తెలుగులో రచయితలు దర్శకులు కావడం ఇటీవలికాలంలో ఎక్కువైంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, పైడిపల్లి వంశీ... ఇలా రచయితలు తమలోని దర్శకుణ్ణి బయటకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో గోపీ మోహన్ కూడా చేరాడు. వెంకీ, ఢీ, రెఢీ, నమో వెంకటేశ వంటి చిత్రాలకు కథలు అందించాడు గోపీమోహన్. ఆయన ఇప్పుడు తాను దర్శకుడిగా మారడానికి సిద్ధమయ్యాడు. అందుకోసం ఒక కథను సిద్ధం చేసుకున్నాడు. ఇంతకీ గోపీమోహన్ ఎవరితో పనిచేయనున్నాడో తెలుసా... సునీల్ తో. ఇటీవలికాలంలో కమెడియన్ పాత్రలు వదిలేసి హీరో పాత్రలకు షిష్టైపోయాడు సునీల్. అతడు ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నాగచైతన్యతో కలిసి నటిస్తున్నాడు. ఈ చిత్రం అయిపోతే అతడు గోపీ మోహన్ తో కలిసి పనిచేస్తాడట. దర్శకులైన రచయితల్లో ఇప్పటివరకూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినవాళ్లు లేరు. ఎందుకంటే... దర్శకుణ్ణి రచయిత డామినేట్ చేయడం వల్ల. మరి, గోపీమోహన్ కూడా వాళ్ల దారిలోనే వెళ్తాడో లేదంటే భారీ హిట్టు కొడతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: