గతంలో ఎన్నడూ లేని విధంగా బాలకృష్ణ వరసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ఎప్పుడూ లేని విధంగా కొత్త దర్శకుడు శేఖర్ రాజా (ఊకొడతారా..)తోనూ నటించాడు. ఇంకా బాలయ్య ఫైనల్ చేయాల్సిన సినిమాల లిస్ట్ కూడా పెద్దగానే ఉంది. కాగా, దర్శకుడు తేజ ఇటీవల బాలకృష్ణను కలిసి ఒక కథ వినిపించాట. ఈ సినిమా కోసం ‘రైతు’ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేశాడట. అయితే బాలయ్య ఇంకా తన అంగీకారాన్ని తెలపలేదు. గతంలో ఒక వెలుగు వెలిగిన దర్శకుడు తేజకు ఇప్పుడు సమయం కలసిరావడం లేదు. అతను చేసిన చిత్రాలన్నీ వరసగా పరాజయం చెందుతున్నాయి. దీంతో పెద్ద హీరోలు తేజను దగ్గరకు రానివ్వడం లేదు. వెంకటేష్ తో ‘సావిత్రి’ అనే సినిమా తీయాలని తేజ ఎంతగానో ప్రయత్నించాడు. అయితే వెంకటేష్ ఛాన్స్ ఇవ్వలేదు. మరీ ఇప్పడు బాలయ్య ఏం చేస్తాడో..? 

మరింత సమాచారం తెలుసుకోండి: