ఇలియానా నటించిన ‘జులాయి’, ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలు విడుదలకు సిద్ధం కానున్నాయి. ఒకప్పుడు అల్లు అర్జున్ ఇలియానాను తనతో నటించమని అడిగితే తన కెరీర్ ముగించాలనుకున్నప్పుడు, ముగించేటప్పడు చేస్తానని చెప్పిందట. ఇప్పుడు ‘జులాయి’లో నటించింది. అల్లు అర్జున్ తో నటిస్తే హీరోయిన్ కెరీర్ అంతేనని పలువురు అంటారు. అది దృష్టిలో పెట్టుకునే ఇలియానా అలా చెప్పిందేమో. జులాయి క్రేజీ ప్రాజెక్ట్ కావడం, తన కెరీర్ కూడా గొప్పగా లేకపోవడంతో వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా నటించి ఉంటుందని పలువురు అంటున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: