అ ఆ’ సూపర్ సక్సస్ తరువాత నితిన్ మరొక సినిమాలో నటించడానికి చాల ఎక్కువ సమయమే తీసుకున్నాడు.  ఎన్నో కథలు విన్నాక మాత్రమే తాను నటించబోయే లేటెస్ట్ సినిమాకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోగలిగాడు.  ప్రస్తుతం టాప్ యంగ్ హీరోలు అంతా తాము నటించే ప్రతి సినిమాకు సంబంధించి ఒక డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్న నేపధ్యం తెలిసిందే. 

‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ఎన్టీఆర్ నుండి రామ్ చరణ్ ‘ధృవ’ వరకు యంగ్ హీరోలు అంతా డిఫరెంట్ లుక్స్ తో కనిపించిన నేపధ్యంలో ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని నితిన్ కొనసాగిస్తున్నాడు. హను రాఘవపూడి డైరక్షన్లో నటిస్తున్న నితిన్ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తాడని ఇప్పటి వరకు ప్రచారం జరిగింది.

ఆ మాటలకు బలం చేకూరుస్తు ఈసినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ కు సంబంధించిన నితిన్ లుక్ కు సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి. స్టయిలిష్ గా పెంచిన గెడ్డంతో నితిన్ చాలా హ్యాండ్సమ్ గా ఈ లుక్ లో కనిపిస్తున్నాడు అంటూ అప్పుడే కామెంట్స్ మొదలైపోయాయి.క్రింద పార్టులో కాస్త లెంగ్దీగా ఉండే గెడ్డం స్టయిల్ తో నితిన్ ఆకట్టుకున్నాడనే చెప్పాలి. ఇప్పటివరకు ఇటువంటి స్టయిల్ లో  ఎప్పుడూ నితిన్ ని చూడని సందర్భంలో నితిన్ న్యూ లుక్ అందర్నీ ఆకర్షిస్తోంది.  

ఈమూవీ పై చాల అంచనాలు పెట్టుకున్నాడు నితిన్.  ఈ మూవీ తరువాత పవన్ త్రివిక్రమ్ ల సొంత నిర్మాణ సంస్థలో మరొక సినిమాను చేయవలసి ఉన్న నేపధ్యంలో హను రాఘవపూడి మూవీ ప్రాజెక్ట్ ను వీలైనంత త్వరలో పూర్తి చేసి తన ‘అ ఆ’ సక్సస్ ట్రాక్ ను కొనసాగించాలని నితిన్ కలలు కంటున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: