సాధారణంగా రజనీకాంత్ సినిమాలంటే ప్రేక్షకులకు యమక్రేజ్. అతని సినిమాల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆయన సినిమా ఏ గురించి ఏ చిన్న వార్త తెలిసినా సంతోషపడిపొతుంటారు. అలాంటిది తన సినిమా గురించే రజనీకాంత్ స్వయంగా గొప్పలు చెబితే సీన్ ఎలావుంటుందో ఉహించుకోండి. వివరాలలోకి వెళ్తే.. రజనీకాంత్, దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వచ్చిన శివాజీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పడు ఈ సినిమాను 3డిలోకి మారుస్తున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ ఇటీవల శివాజీ 3డి సినిమాలో కొంత బాగం చూశాను. వాజీ.. వాజీ.. పాట చాలా బాగా వచ్చింది. పాట చూస్తున్నంత సేపు చాలా ఆశ్చర్యమేసింది అని చెప్పుకోచ్చారు. దీంతో శివాజీ 3డి సినిమా చూడాలని రజనీ అభిమానులు చాలా ఉత్సాహపడిపోతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: