హీరోగా రాణించడానికి పూరీ జగన్నాధ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ తెగ కష్టపడుతున్నాడు. అన్నయ్య దర్శకత్వంలోనే 143 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. తరువాత మరి కొన్ని సినిమాలలో నటించినా ఆశించిన సక్సెస్ మాత్రం అందుకోలేక పోయాడు. ఇక తమ్ముడి కోసం అన్నయే మళ్లీ పూనుకున్నాడు. బంఫర్ ఆఫర్ అనే సినిమా తీసి పెట్టాడు. ఈ సినిమాతో సాయిరామ్ శంకర్ కు తొలిసారిగా హిట్ వచ్చింది. అయితే ఆశించిన బ్రేక్ మాత్రం రాలేదు. ప్రస్తుతం యమహో అనే సినిమా సాయిరామ్ శంకర్ నటిస్తున్నాడు. కాగా, మళ్లీ తమ్ముడి కోసం పూరీ ఓక సినిమాను తీయడానికి సిద్ధ పడుతున్నాడు. పూరీ నిర్మాతగా వ్యహరించే ఈ సినిమా కోసం కథ సిద్ధమౌతుందట. సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభమౌతుందని ఫిల్మ్ నగర్ వర్గాల తాజా సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: