అందాల రాక్షసి స్లో హిట్ అవుతుండటంతో అందులో నటించిన నాయిక లావణ్యకి విపరీతమైన క్రేజ్ వస్తోంది. నిర్మాతలు కూడా ఆమె కాల్షీట్ల కోసం క్యూ కడుతున్నారు. ప్రతిభ ఎక్కడున్నా పరిశ్రమ వెలికితీస్తుంది. కానీ ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ప్రేక్షకులు కూడా ప్రతిభను గుర్తుపడుతున్నారు. ఈ విషయాన్ని లావణ్య వివరించింది. ‘‘సినిమా విడుదలకు ముందు మేం చాలా మాల్స్ కు వెళ్ళాం. ఎవరూ గుర్తుపట్టేవారు కాదు. మేం పరిచయం చేసుకుని మాట్లాడేవాళ్ళం. కానీ సినిమా విడుదలయ్యాక ఎక్కడికీ ఫ్రీగా వెళ్ళలేకపోతున్నాం. ఎక్కడికి వెళ్ళినా అందరూ గుర్తుపడుతున్నారు. ఈ ఫీలింగ్ చాలా కొత్తగా ఉంది. చాలా గ్రేట్ గా ఉంది’’ అని చెప్పింది లావణ్య.
మరింత సమాచారం తెలుసుకోండి: