ఓంకార్ డైరక్షన్ లో వచ్చిన రాజు గారి గది మంచి విజయం అందుకుంది. ఎలాంటి అంచనాలు లేని ఆ సినిమా వసూళ్లతో హిట్ సినిమాగా నిలవగా ఆ సినిమా ఇచ్చిన ప్రోత్సాహంతో రాజు గారి గదికి సీక్వల్ గా రాజు గారి గది-2 కూడా వస్తుంది. ఇక ఆ సినిమా అంత పెద్ద బడ్జెట్ కాదు కాస్టింగ్ కూడా కొత్త వారే. కాని ఈసారి నాగార్జున, సమంత లాంటి స్టార్స్ తో గది-2 వస్తుంది.


పేరు థియేటర్ లో సందడి చేయబోతున్న ఈ సినిమా హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతుంది. ఈ సినిమాలో సమంత ప్రత్యేక పాత్రలో నటిస్తుండగా సీరత్ కపూర్ అందాలతో అదరగొడుతుందట. సినిమాలో సీరత్ అందాలకు సెన్సార్ వాళ్లు షాక్ అయ్యారట. అమ్మడు బికిని ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుండగా సినిమాలో కూడా అదే రేంజ్ లో అదరగొట్టిందట.


అశ్విన్ కు జోదిగా నటించిన సీరత్ కపూర్ సినిమాలో ఆమెతో రొమాన్స్ బాగుంటుందని అంటున్నారు. రన్ రాజా రన్, టైగర్ సినిమాల తర్వాత అమ్మడు చేస్తున్న ఈ రాజు గారి గది సీక్వల్ ను తన కెరియర్ కు ఉపయోగించుకోవాలని చూస్తుంది. అందుకే దర్శకుడు ఎంత హాట్ లుక్స్ తో అంటే అంతే హాట్ లుక్స్ తో కనబడిందట. 


నాగార్జున కెరియర్ లో ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తున్నాడు. సినిమా మొత్తం నాగార్జున నడిపిస్తాడట. సినిమా మీద పూర్తి నమ్మకంగా ఉన్న నాగ్ టార్గెట్ కూడా చిన్నదే అవ్వడంతో సినిమా తన హిట్ ఖాతాలో పడ్డట్టే అంటున్నాడు. మరి ఫలితం ఎలా ఉండబోతుందో మరో పూట గడిస్తే తేలిపోతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: