దశాబ్దకాలానికిపైగా సినీ ప్రేక్షకులను సినీ నటి రంభ అలియాస్ విజయలక్ష్మీ ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేష్, హిందీలో సల్మాన్ ఖాన్ లాంటి అగ్రనటులతో నటించి మెప్పించారు.ఆ తర్వాత కెనడా వ్యాపారవేత్త ఇంద్రన్ పద్మనాథన్‌ను పెళ్లాడి సినిమాలకు దూరమైంది.సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రంభ తాజాగా తన అభిమానులకు శుభవార్తను అందించారు.
తాను మూడో బిడ్డకు జన్మనివ్వబోతున్నాను అని ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా నన్ను అభిమానించే వారికి ఓ శుభవార్తను అందించాలనుకొంటున్నాను. నేను మూడో బిడ్డకు జన్మనివ్వబోతున్నానని తెలపడానికి గర్వంగా ఉంది. వైవాహిక జీవితంలో చిన్నపాటి ఒడిదుడుకులను ఎదుర్కొన్న నటి రంభ ఇప్పుడు ఒక స్వీట్ న్యూస్‌తో వచ్చింది.
భర్తతో వివాదాన్ని కోర్టు బయటే పరిష్కరించుకున్న ఈ నటీమణి ఇప్పుడు మళ్లీ తల్లి కాబోతోంది. ఈ ఆనందాన్ని ఎలా పంచుకోవాలో అర్థం కావడం లేదని పేర్కొంది. తనను అభిమానించే వారందరితోనూ ఈ ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నానని రంభ పేర్కొంది. ఆ మద్య బుల్లితెరపై ఎబిసిడి డ్యాన్స్ షో లో జడ్జీగా వ్యవహరించారు.
