జూనియర్ ఎన్టీఆర్ హీరో గా శ్రీనువైట్ల దర్శకత్వంలో బాద్ షా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమాలో యువహీరో నవదీప్ కూడా నటిస్తున్నాడు. బాద్ షాలో నవదీప్ విలన్ గా నటిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు సమాచారం.
సినిమాలో పూర్తి స్థాయి లో సాగే ఈ పాత్ర నవదీప్ కు మంచి పేరు తీసుకుని వస్తుందని భావిస్తున్నారు. కాగా, హీరోగా కొన్ని సినిమాల్లో నటించిన నవదీప్ కు అశించిన బ్రేక్ రాలేదు. ఈ బాద్ షా నవదీప్ కెరీర్ కు లిఫ్ట్ ఇస్తుందని చిత్ర యూనిట్ అంటుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: