బద్రినాధ్ చిత్రం తరువాత అల్లు ఆర్జున్ నటిస్తున్న చిత్రం జులాయి. ఎడాది గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హిట్ చిత్రం ఇవ్వలన్న కసితో బన్నీ ఉన్నాడు. ఖాలేజా అట్టర్ ప్లాప్ దెబ్బకి కుంగిన త్రివిక్రమ్ విషయం తెలిసిందే.  కాగా హిట్ కోసం తివిక్రమ్  చక్కని స్ర్కిప్ట్, స్ర్కిన్ ప్లేతో అందంగా జులాయి చిత్రాన్ని మలుచ్చున్నారు. వర్క్ పట్ల త్రివిక్రమ్ పడే తపన చూసి ఆయన తో మరో చిత్రం వెంటనే చేయాలని ఉందని బన్నీ మనసు లోని మాటను చెప్పారు.  ఇప్పటికే జులాయి పాటలు హిట్ అయి హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమా కూడా సూపర్ హిట్ ఖాయమని బన్నీ చెబుతున్నారు. త్రివిక్రమ్,బన్నీ,ఇలీయానా, దేవిశ్రీ ప్రసాద్, ల మొదటి కాంబినేషన్ తప్పక హిట్ అవుతుందని జులాయి హీరో బన్నీ నమ్మకం ఏమవుతుందో..వేచిచూడాలి మరి..?

మరింత సమాచారం తెలుసుకోండి: