భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో అల్లరి నరేష్ నటించిన సుడిగాడు సినిమా మంచి కలెక్షన్లతో దూసుకుని పోతుంది. అల్లరి నరేష్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ సుడిగాడు సినిమా ఇప్పటి వరకూ 7 కోట్లకు పైగా వసూలు చేసింది. కాగా, ఇప్పటి కే నిర్మాతలకు గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ ఈ సుడిగాడు తాజా విజయంతో నిర్మాతలకు కల్పవృక్షంగా మారాడు. దీంతో నిర్మాతలు ఇప్పుడు అల్లరి నరేష్ ను వదిలి పెట్టడం లేదు. కాగా, ఎప్పుడూ నిర్మాతలను తన పారితోషకం గురించి మాత్రమే అడిగే అల్లరి నరేష్ ఇప్పడు తన దగ్గరికి వస్తున్న నిర్మాతలను సినిమాకు ఎంత ఖర్చు చేస్తారని అడుగుతున్నాడట.  

మరింత సమాచారం తెలుసుకోండి: