సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారి తరువాత వారి ఫ్యామిలి నుండి ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు అప్పట్లో హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే ఆ తరువాత పలు సినిమాల్లో హీరోగా నటించి మెప్పించిన రమేష్ బాబు, ఆపై సినిమాలకు గుడ్ బై చెప్పారు. ఇక పలు సినిమాల్లో బాలనటుడిగా నటించిన ఆయన చిన్నకుమారుడు మహేష్ బాబు, రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన మహేష్, అక్కడినుండి మెల్లగా వరుసగా సినిమాలు చేసుకుంటూ, ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ హీరోల్లో ఒకరిగా స్థానం సంపాదించి దూసుకుపోతున్నారు. 

ఇకపోతే ఇటీవల వారి ఫ్యామిలీ నుండి కృష్ణ గారి చిన్నల్లుడు సుధీర్ బాబు కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి, ప్రస్తుతం మంచి సినిమాలతో టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. ఇక గత అక్టోబర్ లో కృష్ణ గారి పెద్దల్లుడు మరియు గుంటూరు జిల్లా ఎంపీ గల్లా జయదేవ్ గారి కుమారుడు, గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. దిల్ రాజు నిర్మాతగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అదే నువ్వు అదే నేను అనే టైటిల్ తో లాంచ్ అయిన ఆ సినిమాలో హీరోయిన్ గా నభ నటేష్ ఎంపిక కాగా, నూతన దర్శకుడు శశి దర్శకత్వం వహిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇటీవల కొన్ని అనుకోని కారణాల వలన ఆ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఆ సినిమా స్థానములో అశోక్ హీరోగా అతి త్వరలో మరొక సినిమా ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. 

ఇక ఈ సినిమాకు భలేమంచిరోజు, శమంతకమణి, దేవదాస్ సినిమాల దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కనున్న ఈ సినిమాను అతి త్వరలో ఘనంగా ప్రాంరభించనున్నారని, అలానే ఈ సినిమా ప్రారంభోత్సవానికి, ఈ సారి మేనల్లుడి కోసం స్వయంగా సూపర్ స్టార్ మహేష్ ఆ వేడుకకు హాజరు కానున్నారని అంటున్నారు. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడనుందట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే ఘట్టమనేని ఫ్యాన్స్ కు ఇది మంచి పండుగ వార్తే అని చెప్పాలి....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: