-
Amitabh Bachchan
-
anoushka
-
Anushka
-
bollywood
-
Chiranjeevi
-
Cinema
-
Director
-
Event
-
Heroine
-
Hyderabad
-
Joseph Vijay
-
Konidela Production
-
Mohandas Karamchand Gandhi
-
nayantara
-
niharika konidela
-
October
-
R Rathnavelu
-
Ram Charan Teja
-
Ratnavelu
-
Saira Narasimhareddy
-
Santosham
-
surender reddy
-
uyyalawada narasimha reddy
-
vijay
-
you tube
-
Youtube
మెగాస్టార్ చిరంజీవి తొలిసారి స్వతంత్ర సమరయోధుడిగా నటిస్తున్న సినిమా సైరా నరసింహారెడ్డి. తొలితరం రేనాటి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. మెగాస్టార్ సరసన నయనతార తొలిసారి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి,
రవి కిషన్, కిచ్చ సుదీప్, అనుష్క శెట్టి, తమన్నా, నిహారిక కొణిదెల తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తున్న ఈ సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్నారు. వాస్తవానికి రేపు ఈ సినిమా ప్రి రిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరగవలసి ఉండగా, వాతావరణం అనుకూలించని కారణంగా ఆ ఈవెంట్ ని ఈనెల 22కి వాయిదా వేస్తున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. దానితో ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్ అందరూ ఎంతో నిరాశకు గురయ్యారు.
అయితే ఆ విషయమై వారు నిరాశ చెందినప్పటికీ, సినిమా థియేట్రికల్ ట్రైలర్ మాత్రం రేపు యూట్యూబ్ లో రిలీజ్ అవుతుందని యూనిట్ తెలిపింది. దానితో మెగాస్టార్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై దాదాపుగా రూ. 250 కోట్లకు పైగా భారీ ఖర్చుతో నిర్మితం అవుతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని జూలియస్ పాకీయం అందిస్తున్నారు. ఇకపోతే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, ఈ సినిమాను గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరి రేపు రిలీజ్ తరువాత సైరా ఎంతవరకు అంచనాలు అందుకుంటుందో వేచి చూడాలి....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి