బాలీవుడ్
సినిమా పరిశ్రమలో నటుడిగా తనకంటూ కొంత ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. సల్లు భాయ్ అని, అలానే కండల వీరుడని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ స్టార్ హీరో ఇప్పటికే ఈ ఏడాది భారత్ అనే సినిమాతో అద్భుత విజయాన్ని తన సొంతం చేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఆయన హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం దబాంగ్ - 3. డాన్సర్, నటుడు, మరియు దర్శకుడైన ప్రభుదేవా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 2009లో వీరిద్దరి కాంబినేషన్లో
బాలీవుడ్ వచ్చిన వాంటెడ్
సినిమా మంచి విజయాన్ని నమోదు చేయడంతో ప్రస్తుతం తెరకెక్కుతున్న దబాంగ్ - 3 మూవీ పై అందరిలోనూ మంచి అంచనాలు ఉన్నాయి.
అదీకాక దబాంగ్ సిరీస్ లో ఇప్పటివరకు వచ్చిన రెండు సినిమాలు కూడా అక్కడ సూపర్ హిట్ సాధించడంతో, మాస్ ప్రేక్షకులు ఈ
సినిమా కోసం ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు. చుల్ బుల్ పాండే అనే మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి గతంలోని రెండు సినిమాల్లో తన నటనతో మెప్పించిన
సల్మాన్, ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని తన సొతం చేసుకోవాలని చూస్తున్నారు. ఇకపోతే ఈ
సినిమా అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ అయి, అత్యధిక వ్యూస్ తో, విపరీతమైన ప్రేక్షకాధరణతో దూసుకుపోంతోంది. ట్రైలర్ ఆద్యంతం పక్కా కమర్షియల్ హంగులతో నిండిపోయింది. మాస్ ఫైట్ సీన్స్, డ్యాన్సులు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఛేజింగ్ సీన్స్ తో పాటు ముఖ్యంగా
సల్మాన్ ఖాన్ లుక్స్ మరియు స్టయిల్ తో పాటు డైలాగ్స్ ఎంతో అదిరిపోయాయి.
ఇక ఈ ట్రైలర్ రిలీజ్ తరువాత
సినిమా పై సల్లు భాయ్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా అంచనాలు రెట్టింపు అవడం ఖాయం అనే చెప్పాలి.
సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్, అర్భాజ్ ఖాన్
ప్రొడక్షన్స్ మరియు సాఫ్రాన్ బ్రాడ్కాస్టింగ్
మీడియా వారు సంయుక్తంగా ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమాకు సాజిద్ వాజిద్ సంగీతాన్ని అందిస్తుండగా,
సల్మాన్ సరసన
సోనాక్షి సిన్హా మరియు నూతన నటి సయి మంజ్రేకర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నారు. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ
సినిమా ట్రైలర్ పై ఒక లుక్ వేయండి...!!