మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్, ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో ఒక హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో నటించిన రంగస్థలంతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన రామ్ చరణ్, ఆ తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన వినయ విధేయ రామ సినిమాతో అతి పెద్ద డిజాస్టర్ ని చవిచూశారు. ఇక ప్రస్తుతం నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సూపర్ సక్సెస్ సాధించేలా చరణ్ ఎంతో కష్టపడుతున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాలో చరణ్ అల్లువారి సీతారామరాజుగా నటిస్తుండగా,
మరొక హీరో ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే గత ఏడాది రిలీజ్ అయిన రంగస్థలంతో పాటు, ఆ తరువాత రిలీజ్ అయిన మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను కూడా సూపర్ హిట్ కొట్టడం జరిగింది. అయితే అదే సమయంలో ఆ రెండు సినిమాల కలెక్షన్స్ విషయమై అటు మెగా, ఇటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా రచ్చ జరిగింది. కాగా ఆ విషయం చివరకు చరణ్ వరకు చేరడంతో, ఇకపై తన సినిమాలకు కలెక్షన్స్ ఫిగర్స్ అనేవి ప్రకటించడం జరుగదు అంటూ ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ విషయమై నిన్న ఒక పత్రిక కు ఇచ్చిన ఇంటర్వూలో చరణ్ మాట్లాడుతూ,
నిజానికి రంగస్థలం మరియు భరత్ అనే నేను సమయంలో ఫ్యాన్స్ మధ్య కొద్దిపాటి గొడవలు జరుగడంతో తాను ఇకపై కలెక్షన్స్ ప్రకటించను అని నిర్ణయించానని, అయితే అది ఇటీవల తమ బ్యానర్ పై తన తండ్రి మెగాస్టార్ సైరా సినిమాపై కొంత నెగటివిటీ ని తీసుకువచ్చిందని అన్నారు. నిజానికి చాలా చోట్ల సైరాకు బాగానే కలెక్ట్ చేసినప్పటికీ, కలెక్షన్ పెద్దగా రాలేదు అంటూ కొన్ని మీడియా మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. అయితే మేము అధికారికంగా ఫిగర్స్ ప్రకటించకూడదని నిర్ణయించడంతో సినిమా విషయమై పలు రకాల లెక్కలు ప్రచారం అయ్యాయని అన్నారు.....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి