రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి ఈ నెల 14న భారీ తారాతోరణం మధ్య వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. నిన్న మెగా అభిమానులకు మొయినాబాద్ లో గ్రాండ్ గా డిన్నర్ ని ఏర్పటు చేసారు. ఆ తర్వాత అక్కడి నుంచి కొత్త జంట ఏడుకొండల వాడిని దర్శనార్థం తిరుపతి వెళ్ళారు. శ్రీవారి కళ్యాణ సేవ తర్వాత అక్కడి నుంచి తిరిగి అనంతపురం జిల్లాలోని అరగొండు వెళ్లారు. ఇది ఉపాసన తాత అయినటువంటి ప్రతాప్.సి.రెడ్డి స్వస్థలం. అధగిరి వీరాంజనేయస్వామి టెంపుల్ ని దర్శించుకున్న ఈ జంట అక్కడే ఓ స్కూల్ ని, ఓ వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ ని ప్రారంభించారట. ఇక్కడి నుంచి హైదరాబాద్ తిరిగొచ్చిన రామ్ చరణ్ సోమవారం నుంచి వి.వి.వినాయక్ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గ్ నబొతున్నాడు. పెళ్లి తర్వత హనీమూన్ కోసం ఇటలీ వెళ్ళాలనుకున్న రామ్ చరణ్ హనిమూన్ ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఉపాసన నేను హనిమూన్ కు సంబంధించి ఎలాంటి ప్లాన్ చేసుకోలేదు. ప్రస్తుతం నేను వి.వి.వినాయక్ సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సివుంది. ఈ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చెయ్యాలనుకుంటున్నాం. 3,4 డేస్ తర్వాత షూటింగ్ లో పాల్గోంటాను. ఈ సినిమాను అక్టోబర్ లో ఎట్టిపరిస్థితుల్లో విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాం అని రామ్ చరణ్ అతని సనిహితులు వద్ద చెప్పినట్టు సమాచారం. ఇదే నిజమైతే రామ్ చరణ్ హనీమూన్ ట్రిప్ వాయిదా పడినట్టేనని సినిమా కోసం హనీమూన్‌ని వాయిదా వేసుకోవడమేంటని కొంత మంది సినీ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి