టాప్ హీరోల సినిమాలకు కలక్షన్ రికార్డులు బుల్లితెర షోలకు టి ఆర్ పి రేటింగ్స్ చాల కీలకం. చేతిలోని రిమోట్ తో ఒక ఛానల్ నుండి మరొక ఛానల్ కు వెంటనే ప్రేక్షకులు వెళ్ళిపోతున్న పరిస్థితులలో ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తూ ఒక షోను నిర్వహించాలి అంటే అది చాల కష్ట సాధ్యంగా మారింది. 

‘జబర్దస్త్’ షో నుండి బయటకు వచ్చిన నాగబాబు అనసూయతో కలిసి జడ్జిగా వ్యవహరిస్తున్న ‘లోకల్ గ్యాంగ్స్’ కార్యక్రమానికి చెప్పుకో తగ్గ స్థాయిలో రేటింగ్స్ రావడం లేదని వార్తలు వస్తున్నాయి. రియాలిటీ షోలలో కూడ కొత్తదనం ఆశించే బుల్లితెర ప్రేక్షకులకు ఈ షోలో వైవిధ్యం లేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి. 

ఈ షోను హోస్ట్ చేస్తున్న యాంకర్లు ప్రదీప్ రవిలు తమ పై తామే జోకులేసుకోవడం వీలున్న ప్రతి సందర్భంలోనూ ఊర మాస్ పాటలకు అదిరే మాస్ స్టెప్పుల్ని జతకలపడం జోకులు పేల్చడం లాంటి వెరైటీ ట్రిక్స్ మాత్రమే చేస్తున్నారు. దీనితో ఈ షోకు స్పందన చాల తక్కువగా వస్తోంది అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితులలో ఇప్పుడు అనసూయ స్టెప్స్ ను నమ్ముకుని జడ్జ్ జానీ మాస్టర్ తో కలిసి `చిట్టినడుమునే చూస్తున్నా` పాటకు అనసూయ మతి చెడే స్టెప్పులు వేసింది. 

యాంకర్ ప్రదీప్ యాంకర్ రవిలతో పాటుగా జానీ మాస్టార్ అనసూయ బోలెడంత వినోదాన్ని గ్లామర్ ను అందిస్తూ ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేసారు. ఈ ప్రోమోకు సంబంధించిన వీడియోను చూసిన యూత్ చాలామంది అనసూయ చిట్టినడుము గురించే మాట్లాడుకుంటున్నారు. అనసూయ ఈ రేంజ్ లో చెలరేగితే ఈ కార్యక్రమానికి మంచి రేటింగ్స్ వచ్చి నాగబాబు కూడ గట్టెక్కుతాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనితో నాగబాబు భవిష్యత్ అనసూయ చేతిలో పడిపోయింది అంటూ కొదరు జోక్స్ పేలుస్తున్నారు. ఇంతకీ ఈ చిట్టి నడుము ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: