‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో మహేష్ ఆర్మీ మేజర్ గా నటిస్తున్నాడు. పాకిస్థాన్‌ కు చెందిన ఉగ్ర‌వాదుల మీద భార‌త సైన్యం జ‌రిపిన స‌ర్జిక‌ల్ స్ట్రైక్ ను స్పూర్తిగా తీసుకుని మహేష్ తో చాల ఎమోష‌న‌ల్‌ గా ఈ మూవీలో ఆర్మీ వార్ సీన్స్ ను అనీల్ రావిపూడి చాల ఉద్వేగభరితంగా చిత్రీకరించాడు అన్న వార్తలు వస్తున్నాయి. 


అయితే ఈ వారం విడుదల కాబోతున్న ‘వెంకీ మామ’ మూవీలో కూడ ఇప్పుడు ఇలాంటి సీన్స్ రిపీట్ కాబోతున్నాయి అన్న సంకేతాలు వస్తున్నాయి. ‘వెంకీ మామ’ మూవీలో నాగ చైతన్య ఆర్మీ సోల్జర్ గా నటిస్తున్నాడు. ఈ మూవీలో కూడ ‘యురి’ సినిమాలోని స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌ను త‌ల‌పించే ఒక పవర్ ఫుల్ ఎపిసోడ్ ఉందట. 


‘యురి’ సినిమా స్ఫూర్తితోనే ఈ యాక్షన్ సీన్స్ ను దర్శకుడు బాబి డిజైన్ చేసినట్లు సమాచారం. ఈ యాక్షన్ సీన్స్ లో నాగచైతన్య చాల సీరియస్ గా ఒక ఆర్మీ సోల్జర్ గా కనిపించిన తీరు ఈ మూవీకి హైలెట్ అవుతుంది అని అంటున్నారు. చైతన్య యాక్షన్ ను ఈ సీన్స్ లో చూసిన సగటు ప్రేక్షకుడు ఆ సీన్స్ విపరీతంగా కనెక్ట్ అవ్వడం ఖాయం అని అంటున్నారు.


దీనితో ఒకే తరహా ఆర్మీ యాక్షన్ సీన్స్ ‘వెంకీ మామ’ సరిలేరు నీకెవ్వరు’ లో కనిపించబోతున్నాయి. అయితే ముందుగా ‘వెంకీ మామ’ వస్తున్న నేపధ్యంలోమూస పోసినట్లు ఒకే తరహా ఆర్మీ యాక్షన్ సీన్స్ ను ‘సరిలేరు నీకెవ్వరు’ లో మళ్ళీ రిపీట్ అయితే ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడా అవ్వడా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. ఇప్పటికే ‘అల వైకుంఠపురములో’ పాటలు హిట్ అయిన నేపధ్యంలో బన్నీ టార్చర్ తో పాటు మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ కు అనుకోని శత్రువుగా నాగచైతన్య మారబోతున్నాడా అంటూ కొందరు జోక్స్ వేస్తున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: