త్రివిక్రమ్ సునీల్ సాన్నిహిత్యం ఓపెన్ సీక్రెట్ హీరోగా ఫెయిల్ అయిన సునీల్ కనీసం తిరిగి కమెడియన్ గా అయినా తన పూర్వ వైభవం పొందాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని ప్రయత్నాలు ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. ‘అరవింద సమేత’ లో త్రివిక్రమ్ సునీల్ కోసం ఒకపాత్రను క్రియేట్ చేసినా ఆపాత్ర క్లిక్ కాలేదు. 

దీనితో మళ్ళీ తన మిత్రుడుకి లైఫ్ ఇవ్వాలి అన్న ఉద్దేశ్యంతో ‘అల వైకుంఠపురములో’ సునీల్ కోసం త్రివిక్రమ్ ఒకప్రత్యేక పాత్రను క్రియేట్ చేయడమే కాకుండా కొన్ని మంచి డైలాగ్స్ క్రియేట్ చేసారు అన్న వార్తలు ఉన్నాయి. అయితే నిన్న ఇదుదలైన ‘అల వైకుంఠపురములో’ ట్రైలర్ చూసిన వారికి మాత్రం ఈ సినిమాలో కూడ సునీల్ డమ్మీగా మారిపోయాడా అని అనిపించడం సహజం. 

మూవీ ట్రైలర్ లో టబూ మురళీ శర్మ రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మాజీ జయరామ్ సముద్ర ఖని లాంటి వాళ్లకు ఇచ్చిన ప్రాముఖ్యత సునీల్ పాత్రకు ఎక్కడా కనిపించ లేదు. అంతేకాదు ఈ ట్రైలర్ లో సునీల్ పాత్రకు సంబంధించిన మనిషి కనిపించాడు కానీ ఒక్క డైలాగ్ కూడ బయటకు రాలేదు. 

దీనితో ఈ మూవీ నిడివి ఎక్కువై పోయిందనీ జరిగిన ఎడిటింగ్ లో సునీల్ పాత్రను తగ్గించి వేసారా అన్న సందేహాలు వస్తున్నాయి. దీనికితోడు నిన్న జరిగిన ఫంక్షన్ కు వచ్చిన ప్రేక్షకులు వేదిక పై సునీల్ చూసినా ఏమాత్రం స్పందించ లేదు. అయితే చమక్ చంద్ర హర్షవర్ధన్ లాంటి వాళ్ళు ఒక్కసారి కనిపించగానే ఆ ఈవెంట్ కు వచ్చిన ప్రేక్షకులు స్పందించిన తీరు చూస్తుంటే ఇక సునీల్ కెరియర్ కు పుల్ స్టాప్ పడినట్లేనా అని అనిపిస్తోంది. దీనితో తన ప్రియ మిత్రుడు సునీల్ బాధ్యతను త్రివిక్రమ్ మరింత సీరియస్ గా తీసుకుని సునీల్ కోరుకుంటున్నట్లుగా అతడిని హీరోగా చేసి కామెడీ సినిమాను త్రివిక్రమ్ ఎప్పుడు తీస్తాడో చూడాలి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: