ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాతో సత్తా చాటి ఒక్క క్షణంతో నిరాశపరచిన డైరక్టర్ వి.ఐ.ఆనంద్ ఈసారి మాస్ మహరాజ్ రవితేజతో డిస్కో రాజా సినిమా చేశాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రీమియర్ షోస్ నుండి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా సూపర్ అనిపించగా సెకండ్ హాఫ్ డైరక్టర్ ట్రాక్ తప్పించాడని అంటున్నారు. సైఫై థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కు మంచి మార్కులు పడగా ఇంటర్వల్ బ్యాంగ్ కూడా బాగుందట. 

 

ఇక రవితేజ పర్ఫార్మెన్స్ సూపర్ అని అంటున్నారు.. కొన్నాళ్లుగా సరైన హిట్టు లేక కెరియర్ లో వెనుకపడ్డ రవితేజకు డిస్కో రాజాలో తన టాలెంట్ చూపించే అవకాశం దక్కిందని తెలుస్తుంది. అయితే రవితేజ పెట్టుకున్న నమ్మకాన్ని డైరక్టర్ వి.ఐ.ఆనంద్ కొంతమేరకు న్యాయం చేశాడని చెప్పొచ్చు. అందుకే డిస్కో రాజా మీద కామన్ ఆడియెన్స్ లో కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. ఇక సినిమా సెకండ్ మొదటి 30 నిమిషాలు కూడా పర్వాలేదు అనిపించాయి. సినిమాలో బాబీ సిం హా పర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. 

 

వరుస విజయాలతో దూసుకెళ్తున్న మ్యూజిక్ డైరక్టర్ థమన్ కూడా ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సినిమాలో రవితేజ వింటేజ్ లుక్ హైలెట్ గా ఉంటుందని తెలుస్తుంది. మాస్ రాజా ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసితో పనిచేశాడు.. అది తెర మీద కనిపిస్తుంది. ఇలాంటి ప్రయోగాత్మక సినిమాకు సినిమాటోగ్రఫీ కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. కార్తిక్ ఘట్టమనేని కెమెరా వర్క్ కూడా సినిమాకు మేజర్ హైలెట్ అని అంటున్నారు. మొత్తానికి ప్రీమియర్స్ నుండి డిస్కో రాజాకు పాజిటివ్ టాక్ రాగా అది సూపర్ హిట్ బొమ్మేనా కాదా అన్నది తెలుగు రెండు రాష్ట్రాల్లో సినిమా పడితేనే తెలుస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: