రజినీకాంత్ హీరోగా, మురుగుదాస్ డైరెక్ట్ చేసిన, నిర్మాణ సంస్థ లైకా ఆధ్వర్యంలో వచ్చిన సినిమా దర్బార్. ఈ సినిమా చేసిన వారు నిర్మించిన వారు బాగానే సేవ్ అయ్యారని, దర్బార్ మూవీ నష్టాలతో ఉద్యమ బాట పట్టారు ఈ సినిమా బయ్యర్లు. దర్బార్ సినిమాను కొనుగోలు చేయడం వల్ల సుమారు రూ. 50 కోట్లకు పైగా నష్టపోయామంటూ.. మాకు న్యాయం చేయాలంటూ ఇటీవల రజినీకాంత్ ఇంటిని ముట్టడించేందుకు బయ్యర్లు ప్రయత్నించారు. 

 

 

కేవలం ఈ సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లు మాత్రమే అప్పుల పాలయ్యామంటూ ఆవేదన చెందుతున్నారు. బయ్యర్లను నిర్మాణ సంస్థ పట్టించుకోక పోవడంతో హీరో రజినీకాంత్, దర్శకుడు మురుగుదాస్‌ లు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అయితే వారి నుండి సరైన స్పందన రాకపోవడంతో కోర్టుకు వెళ్లారు బయ్యర్లు. దర్శకుడు మురుగుదాస్‌ పై ఫిర్యాదు చేయడంతో తమకు జరిగిన నష్టం పై ఆయన బాధ్యత వహించాలని కోరారు.

 

 

అయితే ఇష్యూ పై ఘాటుగా తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడు, నగరి ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమని స్పందించారు. సినిమా వల్ల నష్టం వచ్చే బాధ్యత వహించాల్సింది నిర్మాతలు.. దర్శకుల్ని బాధ్యుల్ని చేసి వాళ్లపై కేసులు పెట్టడం సరికాదంటూ సెల్వమని వ్యాఖ్యానించారు. తమిళ దర్శకుల సంఘంలో సభ్యుడైన మురుగుదాస్‌ కి తాము అండగా నిలుస్తామని.. సినిమాని కొనడం అమ్ముకోవడం బయ్యర్లకు సంబంధించిన విషయం.. అయినా సినిమాకి నష్టాలు వచ్చాయి కాబట్టి దర్శకుడు ఇవ్వాలని అంటున్నారు.. అదే లాభాలు వస్తే దర్శకుడికి ఇస్తారా..? అంటూ ప్రశ్నించారు. 

 

 

అసలు ఇలాంటి పరిస్థితి రావడానికి హీరో రజినీకాంత్ కారణం అని ఆయనపై సెల్వమని విమర్శలు గుప్పించారు. గతంలో సినిమాని కొని నష్టపోయిన వాళ్లకు తిరిగి డబ్బులు ఇచ్చే సాంప్రదాయాన్ని రజినీకాంత్ తీసుకుని రావడంతో సినిమా ఆడకపోయిన ప్రతిసారి ఇలాంటిది జరుగుతూనే ఉంటుందని.. ఆయనకు ఇవ్వాలనిపిస్తే తిరిగి ఇవ్వొచ్చని ఇందులోకి దర్శకుల్ని లాగడం సరికాదంటూ చురకలేసారు. కాగా., ఈ విషయంపై రజనీ ఫ్యాన్స్ మురుగదాస్ పై కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: