బుల్లితెరపై ముందుగా యాంకర్ గా అక్కడక్కడా కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ మొదట కొనసాగిన మాచిరాజు ప్రదీప్, ఆ తరువాత మెల్లగా తన టాలెంట్ తో ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ బుల్లితెరపై దూసుకెళ్లాడు. ఇక ఒకానొక సమయంలో ఈటివిలో ప్రసారమైన స్టార్ మహిళ, ఆ తరువాత స్టార్ మా లో వచ్చిన ప్రదీప్ పెళ్లి చూపులు, అలానే జీ తెలుగులో వచ్చిన కొంచెం టచ్ లో ఉంటె చెప్తాను వంటి షోలు ప్రదీప్ కు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని తీసుకువచ్చాయి. ఇక ముఖ్యంగా యువత తో పాటు అమ్మాయిల్లో ప్రదీప్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఆ తరువాత నుండి వరుసగా బుల్లి తెర అవకాశాలతో పాటు మధ్యలో అక్కడక్కడా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కూడా మెరిసిన ప్రదీప్, ఇటీవల కొంత అనారోగ్యానికి గురయ్యాడు. అయితే కొద్దిరోజుల విరామం తరువాత మళ్ళి మంచి కం బ్యాక్ ఇచ్చిన ప్రదీప్ ప్రస్తుతం ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. 

 

ఆయన సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా మున్నా దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ మూవీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఇక ఇటీవల ఈ సినిమాలోని 'నీలి నీలి ఆకాశం'లిరికల్ సాంగ్ ని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన చేతుల మీదుగా యూట్యూబ్ లో రిలీజ్ చేయగా, ఆ సాంగ్ 10 మిలియన్లకు పైగా వ్యూస్ తో పాటు 65 కె లైక్స్ తో దూసుకెళ్లింది. ఇక అదే సాంగ్ ని ఇటీవల ఫుల్ వీడియో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఇక ప్రస్తుతం ఆ సాంగ్ అయితే మరింతగా యూట్యూబ్ లో దూసుకెళ్తూ, ప్రస్తుతం ఏకంగా 40 మిలియన్లకు పైగా వ్యూస్ తో పాటు 572కె లైక్స్ తో మరింత అద్భుతంగా దూసుకెళ్తోంది. 

 

నిజానికి మంచి పేరున్న హీరోకి కూడా ఇంత తక్కువ కాలంలో ఒక సాంగ్ కి ఈ విధంగా వ్యూస్ వచ్చే పరిస్థితి లేదని, అయితే సాంగ్ బాగుండడం, అలానే దానిని సూపర్ స్టార్ మహేష్ రిలీజ్ చేసిన క్రేజ్ తో పాటు, యువ సింగర్ సిద్ శ్రీరామ్ దానిని ఆలపించడం, అన్నిటికంటే ముఖ్యంగా సంగీత దర్శకుడు అనూప్ ఆ సాంగ్ కి ఎంతో మెలోడియస్ ట్యూన్ ని అందించడంతో ప్రస్తుతం ఆ సాంగ్ ఇంతటి గొప్ప రికార్డ్స్ సాధిస్తూ దూసుకెళ్తోందని, దీనివలన తమ సినిమాకు మంచి క్రేజ్ రావడం జరిగిందని యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారట. వామ్మో ప్రదీప్, ఇది మాములు విషయం కాదుగా, ఒక్కసారిగా అందరికీ దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ చేసావుగా అంటూ పలువురు నెటిజన్లు తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఈ సాంగ్ యూట్యూబ్ రికార్డ్స్ పై కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆ సాంగ్ సూపర్ సక్సెస్ తో, అటు సూపర్ స్టార్ మహేష్ కు, అలానే సినిమా యూనిట్ కి కూడా ధన్యవాదాలు చెప్తూ హీరో ప్రదీప్ నిన్న రాత్రి తన ట్విట్టర్ ఒక పోస్ట్ పెట్టాడు. ఇక ప్రస్తుతం ఆయన చేసిన ఆ పోస్ట్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది......... !!

మరింత సమాచారం తెలుసుకోండి: