సౌత్ క్రేజీ హీరోయిన్ సమంత పెళ్లి తర్వాత కూడా సూపర్ ఫామ్ లో ఉంది. రంగస్థలం, మజిలీ, ఓ బేబీ సినిమాలతో సక్సెస్ అందుకున్న సమంత ఈ ఇయర్ వచ్చిన జాను సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవలేదు. వరుసగా హిట్లు కొడుతున్నప్పుడు సక్సెస్ ఫుల్ హీరోయిన్ అన్న మీడియా ఒక సినిమా పోగానే సమంత ఫ్లాప్ హీరోయిన్ అనేసింది. ఈ వార్తలు సామ్ ను బాధపెట్టాయని తెలుస్తుంది. ఒక సినిమాకె ఫ్లాప్ హీరోయిన్ అనేస్తారా మరి హీరోలు వరుసగా రెండు మూడు ఫ్లాపులు ఇచ్చినా సరే వాళ్ళని ఎందుకు ఫ్లాప్ హీరోలు అనరని ప్రశ్నిస్తుంది సమంత.

 

హీరోయిన్స్ అంటే అంత చులకన భావం ఎందుకు. హిట్ కొడితే మాత్రం ఆకాశానికి ఎత్తేసే మీడియా ఒక్క ఫ్లాప్ వస్తేనే ఫ్లాప్ హీరోయిన్ అనడం ఏమి బాగాలేదని అంటుంది సమంత. ఆమెను ఫ్లాప్ హీరోయిన్ లిస్ట్ లో చేర్చినందుకు సమంత బాగా హర్ట్ అయినట్టుగా ఉంది. 96 రీమేక్ గా వచ్చిన జాను సినిమా కమర్షియల్ గా ఫెయిల్ అయినా నటన పరంగా మాత్రం సమంతకు మంచి మార్కులే పడ్డాయి. ఎలాంటి పాత్ర అయినా అవలీలగా చేసే టాలెంట్ సమంతకె సాధ్యం అనేలా మరోసారి తన ప్రతిభ చాటుకుంది.

 

జాను ఫెయిల్యూర్ సమంతను ఆలోచనలో పడేసింది. ప్రస్తుతం అమెజాన్ వెబ్ సీరీస్ ఫ్యామిలీ మెన్ సెకండ్ సీజన్ లో నెగటివ్ రోల్ లో నటిస్తున్న సామ్, గేమ్ ఓవర్ సినిమా దర్శకుడు అశ్విన్ శరవణన్ తో సమంత ఒక సినిమా చేస్తుందని తెలుస్తుంది. డైరెక్టర్ చెప్పిన కథ నచ్చడంతో సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. థ్రిల్లర్ గా వచ్చే ఈ సినిమా తెలుగు,తమిళ భాషల్లో తెరకెక్కిస్తారని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ న్యూస్ బయటకు రావాల్సి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: