మెగాస్టార్ పెద్ద కుమార్తె కొణిదెల సుష్మిత రామ్ చరణ్ నిర్మాతగా వహించిన సైరా నరసింహారెడ్డి సినిమా కి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిందన్న విషయం తెలిసిందే. ఈమె తన తమ్ముడు చిత్రంలో నటించిన అమితాబ్ బచ్చన్ కి కూడా స్పెషల్ కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసింది. రామ్ చరణ్, సుస్మిత ఎప్పుడూ చిన్నచిన్న అల్లరి పనులు చేస్తూనే ఉంటారట. అయితే చిన్నపటి నుండి కలుసున్న రామ్ చరణ్ గురించి ఎవరూ ఊహించలేని వ్యాఖ్యలు చేసి ప్రస్తుతం నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తోంది సుస్మిత.




మెగా ఫ్యామిలీ లో సూపర్ గా డాన్స్ చేసేది ఎవరంటే చిరంజీవి అని టక్కున ఎవరైనా చెప్తారు. కానీ చిరంజీవి తర్వాత మెగా ఫ్యామిలీ లో బాగా డాన్స్ చేసేది ఎవరు అని ప్రశ్నిస్తే... సాధారణంగా ఎవరైనా కాసేపు ఆలోచించి రామ్ చరణ్ లేకపోతే అల్లు అర్జున్ అని చెబుతారు. కానీ 'మన రేడియో' నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న కొణిదెల సుస్మిత మాత్రం ఇదే ప్రశ్న అడిగినప్పుడు... కనీసం ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా అల్లు అర్జున్ అని చెప్పేసింది. తన తమ్ముడు కూడా బాగానే డాన్స్ చేస్తాడని ఇక్కడ చెప్పకపోవడం అందర్ని విస్తుపోయేలా చేస్తోంది.




రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరూ మంచి డాన్సర్ లేనని... ఎవరి గొప్ప వారిదేనని ఇక్కడ ఒకరు తక్కువ మరొకరు ఎక్కువ అనే సందేహమే లేదని కొణిదెల సుస్మిత వ్యాఖ్యల పట్ల రామ్ చరణ్ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఆరంజ్, మగధీర, నాయక్, వినయ విధేయ రామ సినిమాల్లో రామ్ చరణ్ చేసిన డ్యాన్స్ స్టెప్పులు ఎంత మందిని ఫిదా చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ సొంత అక్కే తన తమ్ముడి డాన్సింగ్ టాలెంట్ ని గుర్తించకుండా వేరే పేరు అనగా అల్లు అర్జున్ పేరు చెప్పటం రామ్ చరణ్ ఫ్యాన్స్ ని బాగా నొప్పించిందని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: