సినీ ఇండస్ట్రీలోని టాప్‌ స్టార్ల పిల్లలు సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ కన్నా ముందే స్టార్ స్టేటస్‌ ను ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో యాక్టివ్ గా ఉండే టాప్‌ స్టార్ల వారసులు ఇప్పటి నుంచి స్టార్ లుగా చలామణి అవుతున్నారు. బాలీవుడ్ టాప్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ కూతురు ఇరా ఖాన్‌ కూడా ఈ సెలబ్రిటీ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తోంది.

 

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక పోయినా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్‌ చేస్తూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది ఇరా ఖాన్‌. ప్రస్తుతం క్వారెంటైన్‌లో ఉన్న ఈ భామ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానం ఇచ్చింది ఇరా.  ఈ చాట్‌ లో ఓ అభిమానిని, ఇరా ఈ క్వారెంటైన్‌ సమయంలో ఏం చేస్తున్నావ్‌ అని అడిగింది. దానికి ఆ వ్యక్తి సాన్యా మల్హోత్రా (దంగల్‌ ఫేం) తో డేటింగ్ చేసే ఆలోచనలో ఉన్నానంటూ సమాధానం ఇచ్చాడు.

 

అయితే ఆ నెటిజెన్‌ సమాధానికి వెంటనే కౌంటర్ ఇచ్చింది ఇరా. `నువ్వు లైన్‌ లో ఉండే. ముందుగా సాన్యా మల్హోత్రాతో నేనే డేట్‌ కు వెళ్తా` అంటూ సరదాగా సమాధానం ఇచ్చింది.  ఆమిర్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన బయోగ్రాఫికల్‌ మూవీ దంగల్ సినిమాలో బబిత ఫొగట్‌ పాత్రలో నటించింది సాన్యా మల్హోత్రా.

 

ఆమిర్‌ ఖాన్‌ మొదటి భార్య రీనా దత్‌ కూతురు ఇరా. ఆమిర్‌ రీనాతో విడిపోయిన తరువాత కూడా ఆమె పిల్లలు ఇరా, జునైద్‌ లతో మంచి రిలేషన్ మెయిన్‌టైన్ చేస్తున్నాడు. మిస్టర్‌ ఫర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌  ప్రస్తుతం  లాల్ సింగ్ చద్ధా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఓ హాలీవుడ్‌ సూపర్‌ హిట్ మూవీకి రీమేక్‌ అన్న ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: