బాలీవుడ్ స్టార్‌ హీరో షారూఖ్‌ ఖాన్ తన పెద్ద మనసు చాటుకున్నాడు. షారూఖ్‌, ఆయన భార్య గౌరీ ఖాన్‌లు నాలుగు అంతస్తుల తమ ఆఫీస్‌ బిల్డింగ్‌ను మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులక క్వారెంటైన్‌ సెంటర్‌ కు వినియోగించుకోమని ముంబై కార్పోరేషన్‌కు అప్పగించారు. ఈ విషయాన్ని బ్రిహన్ ముంబై మున్పిపల్‌ కార్పోరేషన్‌ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.

 

`మహిళలు, చిన్నారులు, వృద్దుల కోసం వారి నాలుగస్థుల భవనాన్ని క్వారెంటైన్ కోసం ఇచ్చినందుకు షారూఖ్‌ ఖాన్‌, గౌరీ ఖాన్‌లకు కృతజ్ఞతలు అంటూ ముంబై మున్సిపాలిటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గతంలోనే కరోనా పోరాటం కోసం ప్రభుత్వానికి భారీ విరాళం ప్రకటించిన షారూఖ్‌, తాజాగా మరో భారీ సాయాన్ని ప్రకటించాడు. కొల్‌కతా నైట్‌ రైడర్స్ ద్వారా కేంద్రానికి సాయం చేసిన షారూఖ్‌, తన నిర్మాణ సంస్థ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వానికి రిలీఫ్‌ ఫండ్‌ ఇచ్చాడు.

 

అంతేకాదు మహారాష్ట్రాలో కరోనా పై పోరాటంలో కీలకంగా వ్యవహరిస్తున్న డాక్టర్లు, శానిటేషన్‌ కార్మికులు, పోలీసులకు పెద్ద ఎత్తున పర్సనల్‌ ప్రొటక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ ను కూడా అందిస్తున్నాడు సూపర్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌. అంతేకాదు షారూఖ్‌కు చెందిన మీర్‌ ఫౌండేషన్‌, ఏక్‌ సాత్‌ ఫౌండేషన్‌తో కలిసి ముంబైలోని 5500 కుటుంబాలకు నెల రోజుల పాటు నిత్యావసరాలను అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: