అల్లు అర్జున్ సుకుమార్మూవీ ప్రారంభం అవడానికి కరోనా సమస్యలతో ఆలస్యం అవుతున్న పరిస్థితులలో బన్నీ అభిమానులలో నిరాశను పోగొట్టడానికి నేడు బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈమూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తూ అభిమానులకు జోష్ ను కలిగిస్తున్నారు. ‘అల వైకుంఠపురములో’ మూవీ తరువాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడంతో పాటు ఈమూవీకి సుకుమార్ దర్శకుడుగా మారడంతో ప్రారంభం నుండి ఈమూవీ పై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి.

 

‘అల వైకుంఠపురములో’ ఇండస్ట్రీ హిట్ కావడంతో అల్లు అర్జున్ నటిస్తున్న ఈలేటెస్ట్ మూవీని ‘అల వైకుంఠపురములో’ టోటల్ కలక్షన్స్ రేంజ్ ని పరిగణలోకి తీసుకుని అత్యంత భారీ రేట్లకు అమ్మాలని ఈ మూవీని నిర్మిస్తున్న మైత్రీ మూవీస్ భారీ స్కెచ్ లు వేస్తోంది. అయితే కరోనా ఎఫెక్ట్ తో సినిమాల పరిస్థితి అయోమయంగా మారి భవిష్యత్ లో టాప్ హీరోల సినిమాల బిజినెస్ కు కూడ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది అన్న అంచనాలు రావడంతో మైత్రీ మూవీస్ నిర్మాతలు ఈమూవీకి భారీ బిజినెస్ రాబట్టడానికి ఒక మాష్టర్ ప్లాన్ వేసి ఈమధ్యనే సుకుమార్ ద్వారా చిరంజీవితో రాయబారాలు చేయించినట్లు టాక్. 

 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీలో బన్నీ పాత్రతో సమానంగా ఉండే మరో కీలక పాత్రను సుకుమార్ క్రియేట్ చేసిన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈపాత్రను చాల పేరున్న ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో చేయించాలని మొదట్లో సుకుమార్ ఈమూవీ నిర్మాతలు భావించారు. అయితే కరోనా ఎఫెక్ట్ తో టాప్ హీరోల సినిమాలకు కూడా భవిష్యత్ లో బిజినెస్ లో సమస్యలు ఏర్పడతాయని ఊహించిన ఈమూవీ నిర్మాతలు ఈమూవీలోని ప్రత్యేకపాత్ర పరిధిని పెంచి ఆపాత్రను చిరంజీవితో చేయిస్తే బాగుంటుందని అభిప్రాయపడి ఈవిషయాన్ని సుకుమార్ ద్వారా చిరంజీవి వద్ద ప్రస్తావన తీసుకు వచ్చేలా ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

 

వాస్తవానికి ఎప్పటి నుండో బన్నీకి కూడ చిరంజీవితో కలిసి నటించాలి అనే తీరనికోరిక ఉండటంతో ఈరాయబారం వెనుక బన్నీ ప్రోత్సాహం కూడ ఉంది అని అంటున్నారు. అయితే చిరంజీవి మాత్రం ఈఅనుకోని రాయబారానికి స్పందిస్తూ తాను నటిస్తున్న ‘ఆచార్య’ మూవీ ఎప్పుడు పూర్తి అవుతుందో తనకే తెలియని పరిస్థితులలో సుకుమార్ కోరికను తీర్చలేనని సున్నితంగా చెప్పినట్లు టాక్. గతంలో రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ మూవీలో చరణ్ కోసం బన్నీ ఒక చిన్న అతిథి పాత్రలో కనిపించాడు. ఆ సినిమా 2013 లో విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పుడు మళ్ళీ చిరంజీవి తన సినిమాలో అతిథి పాత్రలో కనిపించి గతంలో తాను చరణ్ కు చేసిన ఉపకారంలా తన సినిమాకు కూడ చిరంజీవి సహకరిస్తాడు అని బన్నీ వేసుకున్న మాష్టర్ ప్లాన్ కు చిరంజీవి నుండి స్పందన రాలేదు అనుకోవాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: