మహేష్ కెరియర్ గురించి నమ్రత అనుక్షణం ఆలోచిస్తూ ఉంటుంది. మహేష్ బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ మేనేజ్ చేయడంలో నమ్రత చాల తెలివిగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా ముంబాయ్ కి చెందిన ప్రముఖ కంపెనీల బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ డీల్ చేసే ప్రముఖ యాడ్ ఎజన్సీస్ తో నమ్రతకు చాల పరిచయాలు ఉన్నాయి అని అంటారు.

 

ఈ పరిచయాల నేపధ్యంలోనే మహేష్ కు ప్రముఖ లాయడ్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే అవకాశం వచ్చింది. ఏసీ లు ఫ్రిజ్ లకు సంబంధించి ప్రముఖ కంపెనీగా పేరుగాంచిన ఈకంపెనీ నిర్వాహకులు ఇప్పటికే తమ కంపెనీకి సంబంధించి ప్రసారం అవుతున్న యాడ్ ప్లేస్ లో మరొక కొత్త యాడ్ ను షూట్ చేసారు. ఈయాడ్ షూటింగ్ అంతా ఫిబ్రవరి లో జరిగినట్లు తెలుస్తోంది.

 

ఈ యాడ్ కు దర్శకత్వం వహించవలసిందిగా నమ్రత స్వయంగా త్రివిక్రమ్ ను కోరడంతో త్రివిక్రమ్ ఆ యాడ్ షూటింగ్ ను కరోనా సమస్యలు వచ్చే ముందే షూటింగ్ పూర్తి చేసాడు. ఈయాడ్ తో మళ్ళీ త్రివిక్రమ్ మహేష్ ల మధ్య సాన్నిహిత్యం పెరగడంతో ఈమధ్య లాక్ డౌన్ తో ఖాళీగా ఉన్న త్రివిక్రమ్ కు నమ్రత ఫోన్ చేసి మహేష్ తో ఒక సినిమాను చేసే విషయం ఆలోచించవచ్చు కదా అంటూ నమ్రత కోరినట్లు టాక్.

 

ఈఅభ్యర్థనకు త్రివిక్రమ్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే  ఒకవేళ ఈకరోనా సమస్య వల్ల ఏర్పడ్డ షూటింగ్ ల విరామం మరో రెండు నెలలు కొనసాగితే ఖచ్చితంగా ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల వచ్చే ఏడాది సంక్రాంతి నుండి సమ్మర్ కు వాయిదా పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అదే జరిగితే వచ్చే ఏడాది సమ్మర్ వరకు జూనియర్ కోసం వేచి ఉండటం కష్టం కనుక త్రివిక్రమ్ నమ్రత రాయబారాన్ని సీరియస్ గా తీసుకునే అవకాశం కనిపిస్తోంది అంటూ ఇండస్ట్రీలో వార్తలు గుప్పుమంటున్నాయి. దీనికితోడు మైత్రీ మూవీస్ సంస్థకు త్రివిక్రమ్ ఎప్పుడో తీసుకున్న అడ్వాన్స్ ను ఈమధ్యన ఇచ్చివేయడంతో త్రివిక్రమ్ జూనియర్ కోసం అన్ని నెలలు ఖాళీగా కూర్చుని గుమ్మంలోకి వస్తున్న కోట్లు వదులుకోడు అంటూ మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు. అదే జరిగితే ఇప్పటికే అధికారికంగా ప్రకటింప బడ్డ జూనియర్ సినిమా వెన్నక్కు వెళ్ళి మహేష్ సినిమా ముందుకు వస్తే అది ఒకవిధంగా జూనియర్ కు అనుకోని షాక్ అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: