ప్రస్తుతం భారత దేశంలో రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా వైరస్ ను  నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్  విధించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాలని పిలుపునిచ్చిన  కేంద్ర ప్రభుత్వం అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని సేవలను మూసివేస్తూ  నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో చాలా మంది నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెక్కాడితే  కానీ డొక్కాడని పరిస్థితి ఉన్న నిరుపేదలు అందరూ ప్రస్తుతం లాక్ డౌన్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది సినీ సెలబ్రిటీలు మంచి మనసును  చాటుతూ నిరుపేదలకు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు నిరుపేదలకు సాయం చేస్తున్నారు. 

 

 

 ఈ క్రమంలోనే అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ప్రస్తుతం తన ఉదారతను చాటుకున్నారు. లాక్ డౌన్  నేపథ్యంలో చాలా మంది నిరుపేదలు తిండి లేక సతమతం అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిరుపేదల ఆకలిని తీర్చాలి అని భావించిన రకుల్ ప్రీత్ సింగ్... న్యూఢిల్లీ లోని తన ఇంటికి సమీపంలో ఉన్న ఓ మురికివాడలో... కనీసం ఒక్క పూట కూడా తిండి లేక సతమతమవుతున్న 250 కుటుంబాలకు.. రెండు పూటలా భోజనానికి అందించడానికి నిర్ణయించింది రకుల్ . ప్రతిరోజు నిరుపేదలకు రెండు పూటలా భోజనానికి అందిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. దేశవ్యాప్తంగా ఉన్న లాక్ డౌన్  ముగిసేంత వరకు పేదల ఆకలి తీరుస్తూనే ఉంటాను అంటూ ఓ  ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. 

 

 

 మురికివాడలో ఎన్నో  కుటుంబాలు కనీసం తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్నాయి అని తెలిపిన రకుల్ ప్రీత్ సింగ్... ఈ విషయాన్ని తన తండ్రి గుర్తించి తన దృష్టికి తీసుకురావడంతో.. తన ఇంటికి దగ్గర్లో  ఆహారాన్ని తయారు చేసే నిరుపేద ఆకలి తీర్చేందుకు పంపిస్తున్నాము అంటూ వెల్లడించింది. ఒకవేళ ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్  పొడిగిస్తే... పేదలకు ఈ సదుపాయాన్ని కూడా మరిన్ని రోజులు అందిస్తాము అంటూ చెప్పుకొచ్చింది. దేశం ప్రస్తుతం విపత్కర పరిస్థితుల్లో ఉన్న వేళ నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ప్రతి ఒక్కరు సహాయం చేయడానికి ముందుకు రావాలని సూచించింది. తినడానికి తిండి ఇల్లు ఉండడం ప్రస్తుత పరిస్థితుల్లో అదృష్టమే అని చెప్పాలి అంటూ రకూల్  తెలిపారు. అయితే ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేస్తున్న పనిపై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: