విక్టరీ వెంకటేష్ హీరోగా జయంత్ సి. పరాన్జీ డైరక్షన్ లో వచ్చిన సినిమా ప్రేమించుకుందాం రా.. ఆయన రా అన్నాడో లేదో తెలుగు ప్రేక్షకులంతా వెళ్లి సినిమా సూపర్ హిట్ చేశారు. సినిమాలో వెంకీ సరసన అంజలా ఝవేరి హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాతోనే అమ్మడు తెలుగు తెరకు పరిచయమైంది. సినిమా సూపర్ హిట్ అవడంతో అంజలా ఝవేరికి మంచి క్రేజ్ వచ్చింది. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు ఐశ్వర్యా రాయ్ ను అనుకున్నాడట జయంత్. 

 

ఆ విషయాన్ని తెలుగు నిర్మాతలకు చెబితే వాళ్ళు వద్దన్నారట. ఐశ్వర్య రాయ్ అప్పటికే చేసిన రెండు మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి. అందుకే ఆమెను కాదనుకున్నారు. ఆ తర్వాత ఐశ్వర్య రాయ్ బాలీవుడ్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రేమించుకుందాం రా తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో లవ్ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మణిశర్మ మ్యూజిక్ కూడా సినిమాకు హైలెట్ గా నిలిచింది. 

 

ఒకవేళ ఈ సినిమాలో ఐశ్వర్యా రాయ్ నటించి ఉంటే ఎలా ఉండేదో కానీ తెలుగులో ఒక మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది అమ్మడు. ఆ తర్వాత జయంత్ సి. పరాన్జీ డైరక్షన్ లో కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన సినిమాలోనే ఐశ్వర్యా రాయ్ ఒక స్పెషల్ సాంగ్ చేశారు. ఐశ్వర్య డైరెక్ట్ గా తెలుగులో నటించిన సినిమా అదొక్కటే. తమిళంలో చేసినా తెలుగులో మాత్రం ఐశ్వర్య రాయ్ కు ఛాన్స్ రాలేదు. ప్రేమించుకుందాం రా సినిమాలోనే జయప్రకాష్ రెడ్డి విలన్ గా తన నటనతో మెప్పించారు. ఇప్పుడు ఆయన కామెడీ రోల్స్ చేస్తూ కెరియర్ వెళ్లదీస్తున్నారు. ప్రేమించుకుందాం రా సినిమా హిట్ తో వెంకటేష్ తన రేంజ్ మరింత పెంచుకున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: