కరోనా లాక్ డౌన్ తో ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించి బాగా లాభపడిన రంగాలు ఉన్నాయి అంటే అవి టివి ఛానల్స్ డిజిటల్ సినిమా యాప్ లు (ఓటీటీ). ప్రస్తుతం సెలెబ్రెటీల నుండి సామాన్యుల వరకు అమెజాన్ నెట్ ప్లిక్స్ లాంటి డిజిటల్ యాప్స్ లో లభ్యమవుతున్న సినిమాలను వరసపెట్టి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. 


కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాదు తమిళ మళయాళ హిందీ భాషలతో పాటు అనేక హాలీవుడ్ సినిమాలను కూడ వరస పెట్టి చూస్తూ అందరు టివి లకు అతుక్కుపోతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ కరోనా లాక్ డౌన్ ప్రారంభం అవ్వకముందు మహేష్ బాబు కూడా ఓటీటీ బిజినెస్ లోకి ఎంటర్ అవుతాడని వార్తలు వచ్చాయి. 


దీనివెనుక రిలియన్స్ సినిమా అండదండలు ఉన్నాయని కూడ వార్తలు గుప్పుమన్నాయి. అయితే రిలయన్స్ సినిమా లాంటి భారీ సంస్థ అండదండలు ఉన్నా మహేష్ ఆకరినిముషంలో తన ఆలోచనలు విరమించుకోవడానికి కారణం అల్లు అరవింద్ అని అంటున్నారు. ఓటీటీ బిజినెస్ లోకి ఎంటరై అల్లు అరవింద్ ‘ఆహా’ ఇప్పటికీ పూర్తిగా సెటిల్ కాని పరిస్థితులలో అరవింద్ ఎదుర్కుంటున్న పరిస్థితులను చూసి కూడ అనుభవాలు నేర్చుకోకుండా ఒటిటి బిజినెస్ లోకి రావడం ఏమాత్రం మంచిది కాదు అని మహేష్ సన్నిహితులు అతడికి సలహాలు ఇవ్వడంతో ఆఖరి నిముషంలో మహేష్ వెనకడుగు వేసాడు అని అంటారు. 


ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ పిరియడ్ లో పూర్తిగా నిలదొక్కుకోవాలని ఆహా అనేక ప్రయత్నాలు చేస్తున్నా జనం మోజు మాత్రం ఇంకా ఎక్కువగా అమెజాన్ నెట్ ఫ్లిక్స్ లపై ఉండటంతో ఈ గట్టి పోటీని తట్టుకుని రానున్న రోజులలో ఆహా ఎంత వరకు నిలబడుతుంది అన్న విషయమై రకరకాల భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా మహేష్ పరుశు రామ్మూవీ ప్రాజెక్ట్ ప్రారంభం సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజునాడు మొదలయ్యే విధంగా ప్రస్తుతానికి ప్లాన్స్ లో ఉన్నట్లు సమాచారం..   

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: